భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా దసరా సంబురాలు కళతప్పాయి. ఇల్లెందు పట్టణంలో దశాబ్దాలుగా విజయదశమి రోజున దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి, జమ్మి స్థలంలో వరుసగా రథాలను నిలిపి ఉంచే ఆనవాయితీని రద్దుచేశారు. తొమ్మిది రోజులపాటు పూజించి కనకదుర్గ దేవతామూర్తులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చే సంప్రదాయానికి కరోనా ప్రభావంతో అడ్డుకట్ట పడింది.
రావణదహనం కార్యక్రమాలను కరోనా నిబంధనల వల్ల రద్దు చేస్తున్నట్లు ఇల్లెందు పురపాలక సంఘం నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ప్రఖ్యాత కోట మైసమ్మ మూడు రోజుల జాతరను దేవాలయ కమిటీ రద్దు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రాముఖ్యత కలిగిన సింగరేణి బొగ్గు గనుల దసరా ఉత్సవాలను రద్దు చేయడం వల్ల బోసిపోయింది.
ఇదీ చూడండి: కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం