భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీలో సింగరేణి జేకే ఉపరితల బొగ్గు గని బ్లాస్టింగ్ కారణంగా ఇళ్లు బీటలు వారుతున్నాయి. తాజాగా బ్లాస్టింగ్ కారణంగా ఇంటి స్లాబ్ పెచ్చులు ఊడి పడడం వల్ల సత్యవతి అనే మహిళకు గాయాలయ్యాయి. గతంలోనూ బ్లాస్టింగ్ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని జనరల్ మేనేజర్లకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఎన్వీ రెడ్డి కూడా బ్లాస్టింగ్ తీవ్రతను తగ్గించాలని సింగరేణి అధికారులకు సూచించారు.
బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం పట్టణంలోని గృహాలను, స్థానికులను పట్టించుకోకుండా అధిక తీవ్రతతో బ్లాస్టింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్ బస్తీలో పలువురి ఇళ్లు బ్లాస్టింగ్ కారణంగా బీటలు పడి ప్రమాదభరితంగా మారుతున్నాయి. గతంలో బ్లాస్టింగ్ కారణంగా లలిత కళామందిర్ సమీపంలో గృహాలపై రాళ్లు పడడం, ఒక కారు ధ్వంసం కావడం కూడా జరిగింది. 16వ వార్డు ప్రజలు నిరసన వ్యక్తం చేసి సింగరేణి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఇప్పటికైనా అధికారులు బ్లాస్టింగ్ తీవ్రతను పరిశీలించాలని, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి స్థానికులకు న్యాయం చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. మరో సారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఎస్ఎస్సీ గ్రేడింగ్ కేటాయింపు ప్రక్రియ షురూ!
ప్రమాదకరంగా మారిన సింగరేణి ఉపరితల గనుల బ్లాస్టింగ్ - coal mines
సింగరేణి జేకే ఉపరితల బొగ్గు గని బ్లాస్టింగ్ కారణంగా ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీలో ఇళ్లు బీటలు వారుతున్నాయి. పెచ్చులు ఎగిరి పడడం వల్ల పలువురు గాయాలపాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు బ్లాస్టింగ్ తీవ్రతను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.