ETV Bharat / state

MAOIST DEATH: మరో మావోయిస్టు అగ్రనేత కరోనాతో మృతి! - Bhadradri Kottagudem SP Sunil Dutt LATEST NEWS

కరోనా కారణంగా మరో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబర్‌ (డీకేఎస్‌జెడ్‌సీఎం) వినోద్ హేమ్లా అలియాస్ ఇమ్లా మృతి చెందారు. గత కొద్దికాలంలోనే దాదాపు 20 మంది మావోయిస్టులు చనిపోయారు.

dandakaranya-special-zonal-committee-member-vinod-hemla-died-with-corona
మరో మావోయిస్టు అగ్రనేత కరోనాతో మృతి!
author img

By

Published : Jul 14, 2021, 12:57 PM IST

మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబర్‌ (డీకేఎస్‌జెడ్‌సీఎం) వినోద్‌ హేమ్లా అలియస్‌ ఇమ్లా (55) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వినోద్‌ కరోనా సోకి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో అతనిపై రూ. 8 లక్షల రివార్డు ఉంది. 2013లో అక్కడ కాంగ్రెస్‌ అగ్ర నాయకులపై జరిగిన దాడి సహా 16 కీలక దాడులకు అతడు నేతృత్వం వహించాడు. అప్పటి కాంగ్రెస్‌ చీఫ్‌ నందకుమార్‌ పటేల్‌, ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మ, కేంద్ర మాజీమంత్రి విద్యాచరణ్‌ శుక్ల సహా 29 మంది మృత్యువాతపడిన దాడి వినోద్‌ ఆధ్వర్యంలోనే జరిగింది.

గత రెండు నెలల కాలంలో 20 మంది వరకు మావోయిస్టు అగ్రనేతలు, సభ్యులు కరోనాతో మృత్యువాతపడ్డారని ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌రేంజ్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ పేర్కొన్నట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పరిహారంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తామని భద్రాద్రి ఎస్పీ పేర్కొన్నారు.

ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు..

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గల్గామ్‌ అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌, ఎస్టీఎఫ్‌ భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. మావోయిస్టులు ఎదురుపడడంతో గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడంతో పాటు సీఆర్‌పీఎఫ్‌ 196 బెటాలియన్‌కు చెందిన మియలేష్‌ కుమార్‌ అనే జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నడపల్లికి చెందిన కొట్టం సోమా అనే గిరిజనుడికి తుపాకీ తూటా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులిద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: MAOIST LEADER: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.