పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి ముప్పు తప్పదని సీపీఎం నాయకులు బాల నరసారెడ్డి హెచ్చరించారు. 2007 జనవరి 29వ తేదీన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భద్రాచలంలో జరిగిన భారీ ఆందోళనను స్మరించుకుంటూ సమావేశం నిర్వహించారు.
ఈ ఆందోళనలో పోలీసుల జరిపిన కాల్పుల్లో చాలా మంది గాయపడగా.. అనేక మందిపై కేసులు నమోదు చేశారని బాల నరసారెడ్డి తెలిపారు. భద్రాద్రికి పొంచి ఉన్న ముప్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి 14 ఏళ్లు పూర్తయిందని.. పోలవరం ప్రాజెక్టు వ్యతిరేకంగా 14 ఏళ్ల నుంచి పోరాడుతున్నామని గుర్తు చేశారు.
అనేక సర్వే బృందాలు పర్యటించి పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాద్రికి ముప్పు వాటిల్లుతుందని ప్రకటించారన్నారు. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం మొత్తం వరద నీటిలో మునిగిపోతుందని హెచ్చరించారు. సీపీఎం నాయకులు బాల నరసారెడ్డి, గడ్డం స్వామి, బండారు శరత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: లైవ్ మర్డర్: సీసీ కెమెరాలో మాజీ రౌడీషీటర్ ఫిరోజ్ హత్య