సింగరేణి సంస్థ.. కార్మికుల కోసం చేపట్టిన మెగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 12 ఏరియాల్లో నేడు ఒక్కరోజే సుమారు 15వేల మందికి వ్యాక్సిన్ను అందజేయాలని యాజమాన్యం నిర్ణయించింది. సంస్థకు చెందిన 45 వేల మంది కార్మికుల్లో ఇప్పటికే 16 వేల మందికి మొదటి డోసు పూర్తవగా.. మరో వారం రోజుల్లో మిగతా వారందరికి వ్యాక్సిన్ను అందజేయనున్నారు.
రాబోయే ఆదివారం వరకు ఈ ప్రత్యేక శిబిరం కొనసాగనుంది. మెగా డ్రైవ్ అనంతరం.. కార్మికుల కుటుంబ సభ్యులకు, ఒప్పంద కార్మికులకు టీకాలు వేయించనున్నట్లు సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: Viral video: నంబర్ ప్లేట్ లేదని బండి ఆపిన పోలీసులపై యువకుడు ఫైర్