భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 24 వార్డుల్లో కరోనా కట్టడిపై కౌన్సిలర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. పట్టణంలో రెండో విడత మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని 24 వార్డులకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్డౌన్ పొడిగించడం వల్ల ప్రజలందరికి కరోనా వ్యాప్తి కట్టడిపై ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఎంపీ కవిత సూచించారు.