భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే నియోజకవర్గ వ్యాప్తంగా 8 మందిని మహమ్మారి బలితీసుకుంది. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 5 మండలాల్లో 25 మంది కొవిడ్‌తో చనిపోయారు. అశ్వారావుపేట మండలంలో 10 మంది, ములకలపల్లి పరిధిలో ఐదుగురు, అన్నపురెడ్డిపల్లి పరిధిలో నలుగురు, దమ్మపేట, చండ్రుగొండ మండలాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాత పడ్డారు.
నియోజకవర్గంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగటంతో పాటు మరణాల రేటు కూడా రెట్టింపవుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా బారిన పడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని వైద్యులు సూచించారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా మహమ్మారిపై కదనం.. స్వీయనియంత్రణే ఆయుధం