భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని శివారు ప్రాంతంలో విత్తనాలు అమ్మే ఓ దుకాణంలో మొక్కజొన్న విత్తనాలు కలకలం రేపాయి. మొక్కజొన్న విత్తనాలు అమ్మవద్దని.. ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలని వ్యవసాయ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో మొక్కజొన్న విత్తనాలు కలకలం రేపాయి. మొక్కజొన్న విత్తనాలు అమ్ముతున్న విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న విక్రయాలు భారీగా జరుగుతున్నాయని.. ఇందుకు న్యాయపరంగా అనుమతులు ఉన్నాయని సదరు వ్యాపారి తెలిపారు. దానికి సంబంధించిన న్యాయస్థానం అనుమతులు కూడా ఉన్నాయని.. వ్యాపారి తెలిపారు. మొక్కజొన్న పంటల వేయవద్దని ప్రభుత్వం సూచనలు ఉన్నాయని.. ...రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు అమ్మకాలు జరుగుతున్నాయని వీటికి సంబంధించిన బిల్లులు ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. వీటికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారుల పూర్తి విచారణ అనంతరం మొక్కజొన్న విక్రయాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్