Conflict between tribals and forest officials: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల విషయంలో అటవీశాఖ అధికారులు, ఆదివాసీలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చర్ల మండలం వెంకటచెరువు గ్రామంలో అటవీశాఖ అధికారులు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో గిరిజనులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
హరితహరంలో భాగంగా మొక్కల పెంపకానికి, గిరిజనులు సాగుచేసుకుంటున్న భూమిలో భూసేకరణకు అధికారులు వెళ్లారు. దీంతో అటవీశాఖ అధికారులను అక్కడి ఆదివాసీలు అడ్డుకున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జేసీబీలను అడ్డుకున్నారు. జేసీబీ ఎదుట బైఠాయించి ఆందోళకు దిగారు. దీంతో ఏం చేయలేక.. అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి: తుదిదశకు మేడారం హుండీల లెక్కింపు.. రూ.11కోట్లకు చేరువలో ఆదాయం