CM KCR Comments: కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగూడేనికి కొత్త జిల్లా వచ్చింది.. వైద్య కళాశాల వచ్చిందన్నారు. కొత్తగూడేనికి కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం వచ్చిందని చెప్పారు. కొత్తగూడెం ఎక్కువ చైతన్యం ఉన్న ప్రాంతమన్న కేసీఆర్... ఉద్యమ సమయంలో తనను అరెస్టు చేసి ఖమ్మం తీసుకొచ్చారని గుర్తు చేశారు. తనను అరెస్టు చేసి ఖమ్మం తీసుకొచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు కడుపులో పెట్టి చూసుకున్నారని స్పష్టం చేశారు. అందరిని కడుపులో పెట్టుకుని పోతున్నామన్నారు.
''అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దూసుకుపోతోంది. అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మానవీయ కోణంతో కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. మానవీయ కోణంతో కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళానికి నీరు తెచ్చేలా కృషి చేస్తాం. సీతారామా ప్రాజెక్టు వేగంగా పూర్తవుతోంది. సీతారామా ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. 37 టీఎంసీల నిల్వతో సీతారామా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. సీఎంఆర్‌ఎఫ్ కింద దేశంలోనే ఎక్కువ మందికి సాయం చేస్తున్నాం. ముర్రేడు వాగు వరద నివారణ కార్యక్రమం వెంటనే చేపడతాం.'' - కేసీఆర్, ముఖ్యమంత్రి
CM KCR Kothagudem tour: ఉమ్మడి ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు త్వరలో ఇళ్లస్థలాలు ఇస్తామని హామీనిచ్చారు. కొత్తగూడెంలోని మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు రూ.40కోట్ల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తామని ప్రకటించారు. కొత్తగూడెం మైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను పూర్తి స్థాయి ఇంజినీరింగ్ కళాశాలగా మారుస్తామని వెల్లడించారు.
''ప్రజలను విడదీసే కుట్రలను ప్రజలు అడ్డుకోవాలి. మనం కూడా తాలిబన్లలా మారితే పెట్టుబడులు వస్తాయా? సమాజంలో అశాంతి రేగితే కర్ఫ్యూలు వస్తాయి. విద్వేష రాజకీయాల గురించి ప్రజలు ఆలోచించాలి. దేశాన్ని వక్రమార్గంలో పెట్టే దుష్టపన్నాగాలు చేస్తున్నారు. కేంద్రం అసమర్థ విధానాలు అవలంబిస్తోంది. వ్యవసాయ అనుకూల భూభాగం ఉన్న అతి పెద్ద దేశం మనదే. మనదేశంలో 83 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలం. జల వనరులు, మానవ వనరులు ఉన్న దేశం మనది. మన దేశంలో లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తోంది.''- కేసీఆర్, ముఖ్యమంత్రి
minister Ajay comments on cm kcr కేసీఆర్ పాలనతో దేశమంతా తెలంగాణవైపు చూస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. గోసపడ్డ తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఆనందదాయకమన్నారు. సీఎం ఆలోచనలతోనే సీతారామా ప్రాజెక్టు రూపుదిద్దుకుందని తెలిపారు. సీతారామా ప్రాజెక్టు వేగంగా రూపుదిద్దుకుంటోందన్నారు. భద్రాద్రి జిల్లాకు వైద్యకళాశాల ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం అనేక అవార్డులు అందుకుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని జాతిపితగా గుర్తుంచుకుంటారని వివరించారు.
KCR Tour updates అంతకు ముందు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.58 కోట్లతో నిర్మించిన ఈ కలెక్టరేట్ సముదాయం అన్ని హంగులతో ముస్తాబైంది. అంతకుముందు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు.
ఇవీ చూడండి..