ETV Bharat / state

హెచ్చరికలు లేని గుంత.. ఆకస్మాత్తుగా పడిపోయిన కారు

అసలే లాక్​డౌన్, సమయం అంతంత మాత్రం.. ఈలోగా గమ్యాన్ని చేరుకోవాలని ఆత్రం. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో.. సరిగ్గా కూడలి వద్ద నిలువెత్తు అగాధం ఉంది. అది గమనించని ఓ కారు ఆకస్మాత్తుగా గుంతలో పడిపోయింది. ఈ ఘటన కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

author img

By

Published : May 24, 2021, 3:47 PM IST

car fell in to road junction
హెచ్చరికలు లేని గుంత.. ఆకస్మాత్తుగా పడిపోయిన కారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పరిధిలో ఓ కారు ప్రమాదవశాత్తు గుంతలో పడింది. భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద హైమాస్ లైట్ కోసం ఓ పెద్ద గొయ్యి తవ్వారు. అది గమనించని ఖమ్మంకి చెందిన కెనరా బ్యాంకు ఉద్యోగి ఆకస్మాత్తుగా గోయ్యిలో పడిపోయారు. భద్రాచలంలో తన బంధువుల దశదిన కర్మకు హాజరై తిరిగి కారులో ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కొడుకులకు గాయాలయ్యాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండా గుంతని వదిలేయడం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు వాపోయారు. ప్రమాదానికి కారణమైన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.