సింగరేణి సంస్థకు లాభాలు అధికంగా వచ్చినా... కార్మికులకు ఊహించిన విధంగా బోనస్ ప్రకటించలేదని బీఎంఎస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తికి రవాణాకు సంబంధం లేదని గుర్తు చేశారు. ఎగుమతులు కాలేదన్న నెపంతో శ్రామికులను నిరాశపరిచిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన సమావేశంలో అన్నారు.
సింగరేణి సంస్థ కార్మికులకు 35 శాతం బోనస్ ఇస్తారని ఆశిస్తే... కేవలం 28 శాతం మాత్రమే ఇచ్చి కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారుల అవస్థలు