భద్రాద్రి రామయ్య సన్నిధిలోని లక్ష్మణసమేత సీతారాములకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ప్రధాన ఆలయంలోని రామయ్యకి ఏకాంత అభిషేకం నిర్వహించారు.
ప్రాకార మండపంలో నిత్య కళ్యాణ మూర్తులకు పంచామృతాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం వెండి రథ సేవ, తిరువీధి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విజయ రాఘవులు తెలిపారు.