భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
నిత్య కల్యాణ మండపంలో జరుగుతున్న సీతారాముల నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులను నిత్య కల్యాణ మండపం వద్దకు అర్చకులు తీసుకువచ్చారు. జిలకర బెల్లం వేడుక, నూతన వస్త్రాల సమర్పణ, మాంగల్యధారణం, తలంబ్రాల వేడుకలను వైభవంగా నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రదేశాలన్నీ భక్తజనసందోహంతో కళకళలాడుతున్నాయి.
ఇదీ చదవండి: నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం... 'సీఎంగా కేటీఆర్'పై స్పష్టత!