భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. లాక్డౌన్కు ముందు 16 రోజులు స్వామివారికి భక్తులు సమర్పించిన ఆదాయాన్ని గణించారు. కొవిడ్- 19 నిబంధనలు పాటిస్తూ చిత్రకూట మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ముందుగా నోట్ల కట్టలకు, నాణేలకు శానిటేషన్ చేశారు. అనంతరం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని నగదుపై పిచికారి చేశారు. ఆలయ సిబ్బంది అంతా మాస్కులు ధరించి చేతులకు శానిటైజర్ రాసుకుంటూ నియమాలు పాటించారు.
16 రోజులకు గాను నగదు 27 లక్షల 52 వేలు 536 వచ్చింది. కొన్ని విదేశీ కరెన్సీ స్వామివారికి కానుకలుగా రాగా.. వెండి బంగారు ఆభరణాలు ఏమి రాలేదు. ఆలయ ఈవో నరసింహులు ఈ లెక్కింపును పర్యవేక్షించారు.
ఇవీ చూడండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్