భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన భక్తులు గోటి తలంబ్రాలతో భద్రాద్రి రామయ్య సన్నిధికి పాదయాత్రగా తరలి వచ్చారు. మండలానికి చెందిన కొందరు భక్తులు తయారు చేసిన గోటి తలంబ్రాలు పట్టుకుని బుధవారం మణుగూరులో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలు కోలాటం ఆడుతూ.. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దారి పొడవునా శ్రీరామ నామస్మరణతో రహదారులు మార్మోగాయి.
ఇదీ చదవండి:నూతన జంటపై నోట్ల వర్షం