భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సునీల్‌దత్ పరిశీలించారు. ఠాణాకు వచ్చిన ఎస్పీకి సీఐ రమేశ్, ఎస్సైలు శ్రీనివాస్, కుమారస్వామి, సిబ్బంది స్వాగతం పలికారు.
పోలీస్‌స్టేషన్‌లోని పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. ఠాణా సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు.