భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద నీటి ప్రవాహం వేగంగా పెరుగుతున్నందున భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలను పరిశీలించి భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీలో ప్రస్తుతం వరద నీరు చేరినందున ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే
భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పునరావాస కేంద్రాలను పరిశీలించారు. వరద బాధితులకు సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు మంచి భోజనం, వైద్య సదుపాయం, వసతి కల్పించాలని భద్రాచలం ప్రత్యేక అధికారికి సూచించారు.
భోజనం వడ్డించిన ఎమ్మెల్యే
బూర్గంపాడు మండలంలోని సారపాకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు పునరావాసం పొందుతున్న ప్రజలకు భోజనం వడ్డించారు. వరద బాధితులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: గోదారమ్మ ఉగ్రరూపం.. వణుకుతున్న మన్యం