భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న తెలుగు నాటకోత్సవాలు చివరి రోజు కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ హాజరయ్యారు.
అనంతరం ఆయన రాసిన కొన్ని పాటలను పాడి వినిపించారు. భద్రాద్రి కళాభారతి నిర్వాహకులు చంద్రబోస్‌ను ఘనంగా సత్కరించారు. మరుగున పడుతున్న నాటక కళను రాబోయే తరాలకు తెలియజేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి : 'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'