పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల ఎదుట.. జెండాలు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
భాజపా ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని నియోజకవర్గ ఇంఛార్జ్ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ.. ఉద్యోగులు, రైతులను కూడా మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Eatala: ఈటల నివాసానికి తరుణ్ చుగ్‌తో పాటు భాజపా నేతలు