భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించేందుకు కలెక్టర్ మణుగూరులో పర్యటించారు. భగత్ సింగ్ నగర్లో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తో కలిసి పరిశీలించారు.
మురుగు కాలువల్లో చెత్త ,వ్యర్థాలు పేరుకుపోవటంపై కమిషనర్ వెంకటస్వామి, సంబంధిత సిబ్బందిని ప్రశ్నించారు. మూడు రోజులకోసారి పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. పట్టణంలో వైకుంఠ ధామం, శ్మశానవాటిక, కూరగాయల మార్కెట్ ఏర్పాటు కోసం స్థలాలు కేటాయించేందుకు సర్వే నిర్వహించాలని తహసీల్దార్ నారాయణమూర్తిని పాలనాధికారి ఆదేశించారు.