భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 20వ తేది వరకు జరుగుతాయి. 14న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మిథిలా మండపంలో సీతారామ కల్యాణోత్సవం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. 15న పట్టాభిషేక వేడుక నిర్వహిస్తామన్నారు. ఉగాది సందర్భంగా ఆహ్వాన పత్రికలను ముఖ్యమంత్రికి అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎన్నికల కోడ్ కారణంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. బ్రహ్మోత్సవాలకు గవర్నర్ నరసింహన్ను ఆహ్వానించేందుకు ఆలయ పెద్దలు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: నా కుమారుడిని ఆశీర్వదించండి: మంత్రి తలసాని