Bhadrachalam Sita Rama Kalyanam : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి రోజు ఏడాదికి ఒకసారి వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 17న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి వసంతపక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ప్రకటించారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 16న ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 17న సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 18న మహా పట్టాభిషేకం వేడుకలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 9 నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఉంటాయని, ఏప్రిల్ 23 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించారు.
Sita Rama Kalyanam in 2024 : మరోవైపు శ్రీరామనవమి (Sri Rama Navami) సమీపిస్తున్న తరుణంలో ముత్యాల తలంబ్రాలను భక్తులకు అందించనున్నారు. దీని కోసం 175 క్వింటాళ్ల బియ్యాన్ని సిద్ధం చేస్తున్నారు. దాతలు వీటిని ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. 300- 500 కిలోల ముత్యాలు సమకూర్చనున్నారు. శ్రీరామనవమికి 60 కౌంటర్లు ఏర్పాటు చేసి ముత్యాలు లేని తలంబ్రాలు అందించనున్నారు. మిగితా వాటిని పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు పంపిణీ చేయనున్నారు.
భద్రాచల(Bhadrachalam)రామాలయంలో రామ నామంతో మార్మోగేలా ప్రభుత్వం రూ. 2.50 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేయనుంది. ఇప్పటికే రామాలయం ఆధ్వరంలో రూ.1,42,29,000 కేటాయించి భద్రాచలం-పర్ణశాలలో 19 పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొస్తారనే అంచనా మేరకు మండపం వద్ద 50 టన్నుల ఏసీలను సిద్ధం చేయనున్నారు. పరిసర ప్రాంతాల్లో కూలర్లతో పాటు సరిపడా ఫ్యాన్లు అమర్చనున్నారు.
Sita Rama kalyanam arrangements in Bhadrachalam : సీతారాముల కల్యాణ మహోత్స సందర్భంగా పంచరంగులకు రూ.9.80 లక్షలు, విద్యుద్దీపాల అలంకరణకు రూ.18.53 లక్షలు, పుష్పాలంకరణకు రూ.8 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. వీటితో పాటు ఎల్ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు, తాత్కాలిక వసతి, చలువ పందిరి నిర్మాణాలు, స్వాగత ద్వారాలు, సెక్టార్ల రూపకల్పన, ప్రచార గోడపత్రికలు, క్లాత్ డెకరేషన్, లడ్డూప్రసాదాల విక్రయం నిమిత్తం 15 కౌంటర్లు, గోదావరి ఘాట్ వద్ద సదుపాయాలు సమకూర్చనున్నారు.
భద్రాచలంలో ఘనంగా రాపత్తు ఉత్సవాలు - శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునిగా దర్శనమిచ్చిన శ్రీరాముడు
అయోధ్య గుడిలో రాముడి విగ్రహం చూశారా? విల్లుతో కమలం పువ్వుపై కొలువుదీరిన రామ్‌లల్లా