ETV Bharat / state

ఆ జిల్లాలో ముందుగానే కోట్ల మద్యం కొనుగోళ్లు - khammam district latest news today

లాక్​డౌన్​ సడలింపుల కారణంగా రాష్ట్రంలోని అన్ని జోన్లలో మద్యం దుకాణాలు తెరిచారు. ఈ నేపథ్యంలో మందుబాబులు ముందు జాగ్రత్తగా పెద్దఎత్తున కొనుగోళ్లు చేశారు. మంగళవారం నాటికి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలోని మందు ఆదాయం కోట్లల్లో పెరిగింది.

Beware of Billion liquor purchase in advance in khammam district
ఆ జిల్లాలో ముందుగానే కోట్ల మద్యం కొనుగోళ్లు
author img

By

Published : May 14, 2020, 1:31 PM IST

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులో భాగంగా తెరుచుకున్న మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అమ్మకాలు పునః ప్రారంభమై సరిగ్గా ఎనిమిది రోజులైంది. మంగళవారం నాటికి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలోని రూ.కోట్లల్లో మద్యం కొనుగోలు చేశారు. వైరాలోని డిపో నుంచి రూ.53 కోట్ల విలువైన సరకు కొన్నారు. కరోనా కాలంలో ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు ఉండటానికి ప్రత్యేక కారణాలను విశ్లేషించాల్సి ఉందని అధికార వర్గాలంటున్నాయి.

కారణాలివీ..

  • మరోమారు మద్యం దుకాణాలను మూసివేస్తారనే ఆలోచనతో ఎక్కువమంది వ్యక్తిగతంగా నిల్వ ఉంచుకునేందుకు ఆసక్తి చూపటం.
  • ఆంధ్రాలో మద్యం ధరలను 75 శాతం పెంచడం, దుకాణాల సంఖ్యను కుదించడం, అన్ని రకాల బ్రాండ్లను అక్కడ ప్రభుత్వం నిషేధించటం.
  • ఆంధ్రాకు సరిహద్దుగా ఉన్న మండలాల పరిధిలో మద్యం అమ్మకాలు తారాస్థాయిలో సాగటం.
  • ఆంధ్రాకు చెందిన వారు ఏదో ఒక తరహాలో ఇక్కడ కొనుగోలు చేయటం.

ఇదీ చూడండి : షాప్​లో ఉరి వేసుకున్న వ్యాపారి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.