ETV Bharat / state

కరోనా చికిత్స పొందుతూ యువ వైద్యుడు మృతి - కరోనాతో భద్రాచలం వైద్యుడు మృతి

కరోనాకు యువ వైద్యుడు బలయ్యారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నరేష్‌ కుమార్ కరోనాతో మృతి చెందారు. మణుగూరు కరోనా క్వారంటైన్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తుండగా వైరస్ సోకింది. హైదరాబాద్‌లో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మరణం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు.

dr naresh kumar
dr naresh kumar
author img

By

Published : Aug 7, 2020, 10:56 AM IST

Updated : Aug 7, 2020, 12:32 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నరేష్‌ కుమార్ కరోనాతో మృతి చెందారు. మణుగూరులోని కరోనా క్వారంటైన్ సెంటర్‌లో ఇంఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడే కరోనా సోకింది. హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. ఆయన మృతిపై భద్రాచలంలోని వైద్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

డాక్టర్ నరేష్ మరణం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. కరోనా సోకి మరణించడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.

Last Updated : Aug 7, 2020, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.