భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని లంబాడి కాలనీలో మద్యం దుకాణాలు తీసివేయాలని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఆలయం ఎదురుగా మద్యం దుకాణం ఉండటం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మిస్తోన్న సెల్ టవర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. నివాసాలకు సమీపంలో సెల్ టవర్ ఉండటం వల్ల రేడియషన్కు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : చంద్రకళా... డెంగీ ఎంత పని చేసిందమ్మా..?!