గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడం వల్ల అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే బ్యాక్ వాటర్ ఎత్తిపోసే మోటార్లు మొరాయించడం వల్ల రామాలయ అన్నదాన సత్రం వద్ద మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. ఫలితంగా దుకాణాలను అధికారులు మూసివేయించారు.
ఖాళీ చేయండి
అంతకంతకూ గోదావరి నీటిమట్టం పెరగుతుండటం వల్ల అధికారులు ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అక్కడి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని చెబుతున్నారు.
క్షణక్షణం.. భయం భయం
అన్ని సర్దుకొని ఉండాలని చెప్పారు కానీ... తమకు పునరావాసం కల్పిస్తారో లేదో తెలుపలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మోకాళ్ల లోతు వరకు చేరిన నీటితో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని వాపోయారు. ఆ నీటిలో పురుగులు, పాములు ఉండొచ్చని, ఇళ్లలో చిన్నపిల్లలున్నారని భయాందోళనకు గురవుతున్నారు.
ప్రతి ఏడాది ఇదే పరిస్థితి అని.. ముందుగానే అప్రమత్తమై తమకు పునరావాసం కల్పిస్తే ఈ ఇబ్బంది ఉండేది కాదని స్థానికులు మండిపడుతున్నారు.
- ఇదీ చూడండి : మోదీకి రాహుల్ ఫోన్... ఎందుకో తెలుసా?