- " class="align-text-top noRightClick twitterSection" data="">
Congress, Telangana Election Results 2023 Live : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ( Telangana Election Results 2023) కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు.
Joint Khammam District Election Results 2023 Live : ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను, 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఒకచోట బీఆర్ఎస్, మరోచోట సీపీఐ విజయం సాధించింది. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం గుమ్మంలో హస్తం గాలి వీచింది. మరోవైపు ఆ పార్టీ తొలి విజయాన్ని అశ్వారావుపేటలో నమోదు చేయడం విశేషంగా చెప్పవచ్చు. ఆ పార్టీ అభ్యర్థి ఆదినారాయణరావు విజయం సాధించారు. మొత్తం 14 రౌండ్లలో ఓట్లను లెక్కించగా 20,000ల ఓట్లతో, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆయన గెలుపొందారు. ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. ఇల్లెందు బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియపై, కోరం కనకయ్య 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
Bhatti Vikramarka Wins Madhira Seat : మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క గెలిచారు. పాలేరులో హస్తం పార్టీ అభ్యర్థి పొంగులేటి ఘన విజయం సాధించారు. పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, వైరాలో మాలోతు రాందాస్, సత్తుపల్లిలో మట్టా రాగమయి గెలిచారు. భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యపై ఆయన గెలుపొందారు.
Telangana Election Results 2023 : తెలంగాణలో సీపీఐ ఒకే సీటుతో సరిపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుంది. ఇందులో భాగంగానే కొత్తగూడెం నుంచి పోటీ చేసిన కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలుపొందారు మరోవైపు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ 06 స్థానాలు గెలుపొందగా, టీడీపీ 02 స్థానాలు, బీఆర్ఎస్ 01 స్థానంతో సరిపెట్టుకున్నాయి. అదేవిధంగా స్వతంత్రులు 01 స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ముఖ్య నేతలంతా ఉమ్మడి ఖమ్మంలో పట్టు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఎలాగైనా అధికారంలోకి వస్తామన్న ధీమాతో పట్టుదలగా కలిసి పనిచేశాయి. ఇతర పార్టీలోని ముఖ్య నాయకులు హస్తం పార్టీలోకి రావడం కలిసివచ్చింది. దీనికి తోడూ క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, సంప్రదాయ ఓటు బ్యాంకు మరోసారి కలిసివచ్చింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (Joint Khammam District ) అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా హస్తం పార్టీ నేతలు చేసిన కృషి ఫలించింది.
Siddipet, Telangana Elections Result 2023 Live : సిద్దిపేటలో హరీశ్ రావు హవా - ఈసారి గెలుపు లాంఛనం
Telangana Election Results Live 2023 : కాయ్ రాజా కాయ్ - ఎన్నికల ఫలితాల వేళ జోరుగా బెట్టింగ్