ETV Bharat / state

kodali nani gift to Bhadradri Rama : భద్రాద్రి రామయ్యకు కొడాలి నాని కానుక

author img

By

Published : Dec 7, 2021, 12:46 PM IST

KODALI NANI Prayers at BHADRADRI : ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని భద్రాద్రి రామయ్య ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. కానుకలు అందజేశారు.

KODALI NANI: భద్రాద్రి రామయ్యకు కానుకలు సమర్పించిన మంత్రి కొడాలి నాని

KODALI NANI visits BHADRADRI Rama Temple: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సోమవారం సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయం వద్దకు వచ్చిన మంత్రి దంపతులకు ఆలయ ఈవో శివాజీ ఘనస్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు, అర్చకులు శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి క్షేమంగా ఉండాలని, తమ కుటుంబసభ్యులు, ఇరు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి దంపతులు స్వామివారికి రూ.13 లక్షల విలువ గల వైరముడి కిరీటం, అమ్మవారికి పట్టుచీరను కానుకగా సమర్పించారు.

ఇదీ చూడండి: నాకు టీకా వద్దు బాబోయ్... వేసుకోనంటే వేసుకోను!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.