భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాఘ పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములకు 1001 కలశాలతో అభిషేకం నిర్వహించారు. సమస్త నదీజలాలు, సముద్ర జలాలు, పళ్లరసాలు, పంచోదకములు, పాలు, తేనె, నెయ్యి, సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం మహా కుంభ సంప్రోక్షణ నిర్వహించారు.
![bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10796662_thousand.png)
ఈ రోజు మధ్యాహ్నం మహా పూర్ణాహుతి అనంతరం స్వామి వారికి ప్రధాన ఆలయంలో మహా నివేదన నిర్వహించనున్నారు. మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేడుకలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 12వ శతాబ్దపు కట్టడం.. చారిత్రక నిర్లక్ష్యం