ETV Bharat / state

'దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి' - ఇల్లందులో ఏఐకేఎస్​సీసీ సమావేశం

ఆగస్టు 9న చేపట్టబోయే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విజ్ఞప్తి చేశారు. ఇల్లందులో ఏఐకేఎస్​సీసీ సమావేశం నిర్వహించారు.

aikscc meeting at yellandu bradri district
దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
author img

By

Published : Aug 6, 2020, 9:39 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏఐకేఎస్​సీసీ సమావేశం నిర్వహించారు. స్వామినాథన్ కమిషన్​ను పక్కనపెట్టి రైతులకు మేలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు... రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వాల విధానాలను నిరస్తూ... దేశ వ్యాప్తంగా ఈనెల 9న తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, తెదేపా, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.