భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిరుమళ్ల శ్రీనివాస్ తెలుగు భాషపై ఉన్న మమకారంతో సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి ఆటవెలది పద్యాలతో కూడిన నూటొక్క శతకాలను రచించారు. ఈ పద్యాలను లక్ష ప్రతులు ముద్రించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఒకే వేదికపై ఆవిష్కరించారు.
కరోనాపైనా తనదైన శైలిలో జయము మనదే దిగ్విజయము మనదే అనే మకుటంతో సరళమైన భాషలో నూటొక్క పద్యాలను రచించారు. జనంలో కరోనా పై ఉన్న భయాందోళన తొలగించడానికి స్ఫూర్తి నింపడానికి ఈ పద్యాలకు రూపమిచ్చానట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు....ఈ పుస్తకాలను అమెరికా న్యూయార్క్ నగరంలో తానా అధ్యక్షులు తాళ్లూరు జయశేఖర్ ఆవిష్కరించారు.
ఇదీ చూడండి : కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు