భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఆర్టీసీ బస్సు ఢీకొని సోపాన్ తర్కసే అనే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ఆపరేటర్‌గా పని చేస్తున్న తర్కసే... అశ్వాపురం ప్రధాన రహదారిని దాటుతున్న సమయంలో ఈ దారుణం జరిగింది. మణుగూరు డిపోనకు చెందిన బస్సు... కొత్తగూడెం నుంచి వస్తున్న క్రమంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోపాన్ తర్కసే తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై అశ్వాపురంలో పలు రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. వ్యక్తి మృతికి ఆర్టీసి అధికారులే కారణమని ఆరోపిస్తూ... మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'