భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నం చేశాడు. తన అప్పులను అత్తమామలు తీర్చాలంటూ పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ బ్యాంకు వీధిలో గల సెల్‌టవర్ ఎక్కాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దిగాలని విజ్ఞప్తి చేశారు. సీఐ స్వామి ఎంత చెప్పినా వినకుండా దాదాపు గంటన్నరకుపైగా టవర్‌పైనే ఉండిపోయాడు. అత్త కుటుంబసభ్యులు తన అప్పులను తీరుస్తానని ఒప్పుకుంటేనే దిగుతానని బెదిరించాడు. ఎట్టకేలకు పోలీసులు విజయ్‌కుమార్‌ను ఒప్పించి.. కిందికి దిగేలా చేశారు.