ETV Bharat / state

అశ్వరావుపేటలో యాచకురాలు దాతృత్వం - అశ్వరావుపేటలో యాచకురాలు దాతృత్వం

రోడ్లపై భిక్షాటన చేస్తూ జీవనం సాగించే యాచకురాలు... తాను కూడబెట్టిన నగదుతో పండ్లు, మజ్జిగ కొనుగోలు చేసింది. అనంతరం వాటిని కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులకు అందించి ఆదర్శంగా నిలిచింది.

సిబ్బందికి పండ్లు , మజ్జిగ ప్యాకెట్లు అందజేసిన  యాచకురాలు

author img

By

Published : Apr 23, 2020, 5:41 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన యాచకురాలు కరోనా నివారణ చర్యల్లో భాగంగా దాతృత్వం చాటుకుంది. దుర్గాభవాని అనే మహిళ పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయాయి. నోట మాట కూడా సరిగ్గా రాని దయనీయ దుస్థితిలో యాచకురాలుగా మారింది. అశ్వారావుపేటలోని బస్టాండ్ కూడలి, పోలీస్ స్టేషన్ ఎదుట భిక్షాటన చేస్తూ జీవనం సాగించేది. లాక్ డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో పోలీస్ , వైద్య , పారిశుద్ధ్య సిబ్బంది అహర్నిశలు కష్టపడుతూ కరోనా నియంత్రణకు పాటుపడుతున్నారు. వీరి కష్టాన్ని చూస్తున్న యాచకురాలు తాను భిక్షాటన చేసిన సొమ్ము తో పాటు, ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ నగదుతో అరటి పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు కొనుగోలు చేసింది. అనంతరం ఆయా సామగ్రిని ఆటోలో వేసుకుని సిబ్బంది వద్దకు వెళ్లి వారికి అందించింది. ఈ క్రమంలో యాచకురాలి దాతృత్వం చూసిన అధికారులు ఆమెను అభినందించారు.

ఇవీ చూడండి : స్పెయిన్​లో 22వేలు దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.