భదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి కాస్త శాంతించింది. శుక్రవారం వరకు 52.5 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం రాత్రి నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఉదయం ఆరు గంటలకు 52.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది.
సుమారు రెండు అడుగుల మేర తగ్గడం వల్ల స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 52.5 అడుగుల కంటే తగ్గితే అధికారులు ఈ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోవాలన్నారు. గోదావరి ఉద్ధృతికి భద్రాచలంలోని ఏజెన్సీ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవీచూడండి: పులిచింతల వైపు కృష్ణమ్మ పరుగులు