ట్రాక్టర్ ఢీకొని కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన జాటోత్ నరేశ్ దుర్మరణం చెందాడు. కారుకొండ నుంచి గోవింద్రాలకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో నరేశ్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మాజీ సైనికుడు ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండంలోని ఇందిరానగర్లో మాజీ సైనికుడు నరేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇల్లెందు గ్రామీణం పూబెల్లి పంచాయతీ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఈసాల లక్ష్మయ్య, స్వరూపని... పూసబెల్లి నుంచి ఇల్లెందుకు వస్తున్న ట్రాలీ ఢీకొంది. ఈ ఘటనలలో వారు గాయపడ్డారు. వీరిని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు.
ఇవీ చూడండి: గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు