భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పలుచోట్ల 10 కార్ల అద్దాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయని కానీ... ఇప్పుడు ఆకతాయిలు ఏకంగా 10 కార్ల అద్దాలు ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది.



పురపాలక ప్రజాప్రతినిధులకు, పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకొని.. నిందితులను పట్టుకుని వెంటనే శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.


