సిద్దిపేట మండలం బండ చర్లపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపడుతోన్న మినీ డ్యామ్ (1 టీఎంసీ) నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. డ్యామ్ కారణంగా.. వ్యవసాయ భూములతో పాటు తమ గ్రామం కూడా ముంపునకు గురయ్యే ప్రమాదముందంటూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
మొదట డ్యామ్ నిర్మాణం చేపట్టే స్థలం ఓ చోట అని చెప్పి.. ఇప్పుడు మరోచోట పనులు ప్రారంభిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. తమకెలాంటి సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నామన్నారు గ్రామస్థులు. డ్యామ్ నిర్మాణం పేరుతో తమ భూములు లాక్కొంటే.. తామెలా బతికేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు తక్షణమే వచ్చి తమకు సర్వే రిపోర్టులను చూపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారు: తలసాని