ఆదిలాబాద్ జిల్లా రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. గత వారం రోజులుగా యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. ఇవాళ ఇద్దరు ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా నిల్వ ఉందని తెలియడం వల్ల వారి దుకాణాల ముందు లైన్ కట్టారు. ఒక్క వ్యక్తికి గంటకుపైగా నిలబడాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు. యూరియా కొరత లేకున్నా బారులు తీరాల్సి వస్తుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: అత్త పాడె మోసిన నలుగురు కోడళ్లు!