ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ఆధ్వర్యంలో 4వ జిల్లా మహా సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారంలో సంఘం పాత్రను రవీందర్ రెడ్డి కొనియాడారు. అనంతరం విద్యారంగ సమస్యలపై రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విద్యుత్ ఆదా.. ఉత్పత్తితో సమానం : సందీప్ సుల్తానియా