ఇదీ చూడండి : ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం..
భావి ఉపాధ్యాయినులైన అక్కాచెల్లెళ్లను బలిగొన్న బస్సు - ఛాత్రోపాధ్యాయులు
ఇంకో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా వారిని మృత్యువు కాటేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డైట్ కళాశాల విద్యార్థినులిద్దరూ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
భావి ఉపాధ్యాయినులైన అక్కాచెల్లెళ్లను బలిగొన్న బస్సు
ఆదిలాబాద్ రవీంద్రనగర్ కాలనీలో ఓ కళాశాల బస్సు- ద్విచక్ర వాహనం ఢీకొని... ఇద్దరు ఛాత్రోపాధ్యాయులు(ఉపాధ్యాయ విద్య అభ్యసిస్తున్న యువతులు) మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఖానాపూర్ కాలనీకి చెందిన సాజియా అంజుమ్, సాఫియా అంజుమ్ స్థానిక ప్రభుత్వ డైట్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నారు. అప్పటిదాకా కళాశాలలో అందరితో కలుపుగోలుగా ఉన్న సాజియా, సాఫియా సోదరుడితో బైక్‌పై ఇంటికి బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లోగా.. ఇంటికి చేరుకుంటారునుకున్న సమయంలోనే... రవీంద్రనగర్ సమీపంలోని సీఆర్‌ఆర్ కళాశాల దగ్గర మృత్యువు కాటేసింది. ప్రమాదంలో సాజియా, సాఫియా బస్సు వైపు టైర్ కింద పడిపోగా... వారి సోదరుడు ఇవతలి వైపు పడిపోయాడు. ఘటనలో సాజియా అక్కడికక్కడే మృతి చెందగా.. సాఫియా.. రిమ్స్ ఆసుపత్రికి తరలించాక కన్ను మూసింది. సాజియా, సాఫియా తండ్రి సుభాన్ కూడా డైట్ కళాశాలలోనే అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కాచెల్లెళ్లిద్దరూ దుర్మరణం పాలు కావటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
ఇదీ చూడండి : ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం..
sample description