ETV Bharat / state

460 ఇళ్లలో రెండు పింఛన్లు.. సొమ్ము రికవరీకి ఆదేశాలు - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి రెండో పింఛన్‌ తీసుకున్న వారిని ప్రభుత్వం పింఛన్ల జాబితా నుంచి తొలగించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇలాంటి లబ్ధిదారుల వివరాలను అధికారులకు పంపించింది. వీరు అక్రమంగా తీసుకున్న పింఛన్‌ డబ్బులను తిరిగి రాబట్టాలని (రికవరీ చేయడం) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

460 ఇళ్లలో రెండు పింఛన్లు.. సొమ్ము రికవరీకి ఆదేశాలు

author img

By

Published : Jul 11, 2020, 2:14 PM IST

ఒకే ఇంట్లో ఇద్దరు పింఛన్‌ తీసుకుంటున్న వారి వివరాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి రెండో పింఛన్‌ తీసుకున్న వారిని పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇలాంటి లబ్ధిదారుల వివరాలను అధికారులకు పంపించారు. వీరు అక్రమంగా తీసుకున్న పింఛన్‌ డబ్బులను తిరిగి రాబట్టాలని (రికవరీ చేయడం) అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వారు సొమ్ము చెల్లించకపోతే వారి ఇంట్లో అప్పటికే పింఛన్‌ తీసుకుంటున్న మరొకరికి కూడా నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాలో కొన్నేళ్లుగా అక్రమంగా తీసుకుంటున్న వారు 460మంది ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే వీరి జాబితా అంతర్జాలంలో ఉండటం వల్ల అధికారులు సైతం వారి నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

అక్రమాలు నిరోధించేందుకు..

తెరాస ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆసరా పింఛన్లను రెట్టింపు చేసింది. దివ్యాంగులకు రూ.3016, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులకు రూ.2016 చొప్పున ప్రతి నెలా అందజేస్తోంది. ఇందుకు వయసు నిబంధన విధించింది. ఒక ఇంట్లో అర్హులైన వారు ఇద్దరునప్పటికీ.. ఒక్కరికే పింఛన్‌ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కొందరు వివిధ తప్పుడు ధ్రువీకరణపత్రాల సమర్పిస్తూ ఒకే కుటుంబంలో ఇద్దరేసి పింఛన్లు పొందుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోంది. వీటిలో అక్రమాలు జరుగుతున్నాయని పసిగట్టిన ప్రభుత్వం రేషన్‌కార్డు, ఆధార్‌ వివరాలతోపాటు వివిధ సంక్షేమశాఖలు, నాలుగు చక్రాల వాహనాలు కలిగిన తదితర సమాచారాన్ని సేకరించింది. ఇలా వివిధ రూపాల్లో లబ్ధిదారుల వివరాలను సరిపోల్చిన ప్రభుత్వం ఒకే ఇంట్లో ఇద్దరేసి పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించింది. ఆ జాబితాను జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు పంపించింది.

సొమ్ము రికవరీకి ఆదేశం

పింఛన్‌ రూపంలో ఇన్నాళ్లు అక్రమంగా తీసుకున్న సొమ్మును సదరు వ్యక్తుల నుంచి తిరిగి రాబట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కొక్కరు ఒక్కో నెల నుంచి పింఛన్లు పొందుతున్నందున వారు తీసుకున్న పింఛన్ల వివరాలను అంతర్జాలంలో పొందుపర్చింది. ఇలా ఒక్కొక్కరి నుంచి ఎంత రావాలో అంత చెల్లించేలా చూడాలని స్పష్టం చేసింది. ఇలా జిల్లాలో సుమారు 50లక్షల వరకు దుర్వినియోగమైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వారు చెల్లించని పక్షంలో అదే ఇంట్లో పింఛన్‌ తీసుకుంటున్న లబ్ధిదారులకు నిలిపివేయాలని నిర్ణయించింది. ఒకే ఇంట్లో రెండేసి పింఛన్లు తీసుకుంటున్న వారిలో ఎక్కువగా ఆదిలాబాద్‌ పురపాలకంలో 267మంది ఉండగా.. ఉట్నూర్‌లో 42మంది, బోథ్‌లో 27మంది, జైనథ్‌లో 19, నార్నూర్‌లో 16, తాంసిలో 14, తలమడుగులో 9మంది, భీంపూర్‌లో 9మంది, గాదిగూడలో 6, ఇచ్చోడలో 13, ఇంద్రవెల్లిలో 10, గుడిహత్నూర్‌లో 4, బేలలో 7, నేరడిగొండలో 8, సిరికొండలో 4, ఆదిలాబాద్‌ గ్రామీణంలో 3, మావలలో 2ఇద్దరు చొప్పున రెండో పింఛన్‌ దారులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఒకే ఇంట్లో రెండు పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలను ప్రభుత్వం తమకు అందజేసిందని.. వారి నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామీణాభివృద్ధిశాఖాధికారి రాజేశ్వర్‌ రాఠోడ్‌ను పేర్కొన్నారు. తీసుకున్న పింఛన్‌ డబ్బులు ఇవ్వకపోతే.. ఆ ఇంట్లో వారికి పింఛన్‌ నిలిపివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు.

ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.