ఆదిలాబాద్ జిల్లాలో టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కొవిడ్ దృష్ట్యా విద్యార్థులను గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాక లోనికి వెళ్లనిచ్చారు. పరీక్ష కేంద్రంలోనూ సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
పరీక్ష కోసం ఆదిలాబాద్ పట్టణంలో 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా పరీక్ష నిర్వహించడంతో ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. డీఈవో రవీందర్ రెడ్డి ఆయా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ పరీక్షకు 2 వేలకు పైగా విద్యార్థులు హాజరైనట్లు డీఈవో తెలిపారు.
ఇదీ చదవండి: నాగార్జున సాగర్‌కు తగ్గిన వరద... గేట్లు మూసివేత