టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ అభ్యర్థులకు ఈ రోజు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. 189 పోస్టులకుగాను 149 స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ రవీందర్రెడ్డి తెలిపారు. సోమవారం నియామక పత్రాలు అందుకుని విధుల్లో చేరాలని ఆయన సూచించారు. కొత్త ఉపాధ్యాయులుగా రాబోతున్న తాము విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల