తాము సాగుచేస్తున్న పోడుభూములకు, సీలింగ్, అసైన్డ్‌భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఆదివాసీలు పోరుబాటపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కొత్త రెవెన్యూ చట్టంతో తమకు నష్టం తప్పా... లాభం జరగదని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు పేర్కొన్నారు. చట్టంలో సవరణలు చేసి కాస్తులో ఉన్నవారికీ సర్వహక్కులు లభించేలా చూడాలని డిమాండ్‌చేశారు.
ఇదీ చూడండి: పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు: సీఎం