అడవి తల్లినే నమ్ముకున్నాం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు ధర్నాకు దిగారు. పట్టాలు లేని తమను అడవి నుంచి వెళ్లగొట్ట వద్దని.. సుప్రీం తీర్పుపై ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్నామని... ఇప్పుడెక్కడికెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, 20 ఎకరాలలోపు ఉన్న ఆదివాసీలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తింపజేయాలని కోరారు.