ETV Bharat / state

ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత... బస్సులను అడ్డుకున్న తుడుందెబ్బ నాయకులు - తెలంగాణ బంద్‌

Tudum Debba calls for State bandh: ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయులను ఏజెన్సీలోనే ఉంచాలని డిమాండ్‌చేస్తూ ఆదివాసీహక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో తుడుందెబ్బ నాయకులు ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపో వద్ద బస్సులను అడ్డుకున్నారు. జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tudum Debba calls for State bandh
Tudum Debba calls for State bandh
author img

By

Published : Dec 27, 2021, 9:37 AM IST

Tudum Debba calls for State bandh: జిల్లాలు, జోన్‌ల వారీగా ఉపాధ్యాయుల విభజనకు సంబంధించిన జీవో 317ని రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ ఆదివాసీహక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఉదయం తుడుందెబ్బ నాయకులు ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయులను ఏజెన్సీలోనే ఉంచాలని డిమాండ్‌చేస్తూ... ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.

దీంతో ఆర్టీసీ డిపో వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గంటపాటు బస్సుల రాకపోకలు నిలిచిపోగా.. మరో మార్గం గుండా తరలించారు. ఆదివాసీల హక్కులను కాలరాసేందుకు రాష్ట్రప్రభుత్వం 317 జీవోను జారీచేసిందని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్​ విమర్శించారు. జీవోను రద్దు చేసేవరకు పోరాడుతామని తెలిపారు. వ్యాపార వర్గాలు ఈ బంద్‌కు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: Employees Allocation : ఉద్యోగుల విభజన, కేటాయింపులో తెరపైకి కొత్త ప్రతిపాదన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.