ETV Bharat / state

నేడు ఉట్నూర్​లో ఇప్పపువ్వు పండుగ

ఆదిలాబాద్​ సువిశాలమైన అడవులకే కాదు.. రుచికరమైన ఇప్పపువ్వు వంటలకు కీర్తి ఘడించింది. ఉట్నూర్​ ఏజెన్సీలో ప్రతి ఏడాది ఇప్పపువ్వు పేరుతో పండుగ నిర్వహిస్తారు. ఈ పువ్వుతో అనేక వంటకాలు చేస్తారు. ఇవాళ ఉట్నూరు మండల కేంద్రంలోని కుమురం భీం ప్రాంగణంలో ఈ మహోత్సవం జరగనుంది.

నేడు ఉట్నూర్​లో ఇప్పపువ్వు పండుగ
author img

By

Published : May 31, 2019, 6:14 AM IST

Updated : May 31, 2019, 12:20 PM IST

రాష్ట్రంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. భోజన ప్రియులకు హైదరాబాద్​ అంటే గుర్తొచ్చేది బిర్యానీ.. అలా సువిశాలమైన అడవులు కలిగి ఉన్న ఆదిలాబాద్​ జిల్లాకూ ఓ ప్రత్యేకత ఉంది. ఆదివాసీల సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఉట్నూర్​ ఏజెన్సీ ప్రాంతం. అడవుల్లో లభించే ఇప్పచెట్టు పువ్వును సేకరించి రొట్టెలు, లడ్డూలు, ఫ్రై, గారెలు లాంటి పలు రకాల ఆహార పదార్థాలను తయారుచేస్తున్నారు అక్కడి ప్రజలు.

నేడు ఉట్నూర్​లో ఇప్పపువ్వు పండుగ

ప్రతి సంవత్సరం ఇప్ప పువ్వు పండగ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఇక్కడి ప్రజలు. ఈ విషయం తెలుసుకొన్న జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్​ వారందరిని ఒక చోట చేర్చారు. ప్రజామిత్ర సహకార సంఘంగా నమోదు చేయించారు. ఈ ఏడాది ఇప్పు పువ్వు పండుగ నిర్వహించాలని సూచించారు.

నేడు ఇప్ప పువ్వు పండుగ

ఇవాళ ఉట్నూరు మండలంలోని కుమురం భీం ప్రాంగణంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందు కోసం ఇప్పపువ్వుతో అనేక రకాల ఆహార పదార్థాలు చేసే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు.

ఇవీ చూడండి: కేంద్ర సహాయమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

Intro:రాష్ట్రంలోని పలు రకాల వంటకాలు గురించి తెలుసు హైదరాబాదులోని బిర్యాని అదిలాబాద్ జిల్లాలో నీ ఘటక గురించి తెలుసు అందుకు భిన్నంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల వంటకాలు ఇలాంటి ఎరువులకు కావు లేకుండా స్వచ్ఛమైన వాతావరణంలో లభించిన వాటితో తయారు చేసినటువంటి వంటకాలు రుచి చూడాలంటే ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతానికి రావాల్సిందే

అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతం ఆదివాసి లతో కళకళలాడుతున్న ప్రాంతం ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు అదిలాబాద్ జిల్లా ఆదర్శంగా నిలుస్తుంది నేటి తరుణంలో కాలం మారుతున్న ఆదివాసీలు వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ముందుకెళుతున్నారు ఆదివాసీలు అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు
ఎక్కడున్నావ్ తొందర ఎందుకంటే అడవుల్లో లభించే పండ్లు ఫలాలను సేకరిస్తూ వాటినే ఆహారంగా తీసుకుంటూ కాలం గడుపుతున్నారు అటవీ ప్రాంతంలో ని ఇప్ప చెట్టు ద్వారా లభించే ఇప్పపువ్వు సేకరించి వాటితో పలు రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ గత సంవత్సరం ప్రజామిత్ర సహకార సంఘం ఆధ్వర్యంలో ఇప్పపువ్వు పండు గా పేరుతో ఇప్ప పువ్వు తో తయారు చేసే ఆహార పదార్థాలను సాంప్రదాయబద్ధంగా తినే వంటకాలను తయారుచేయాలని సూచించారు ఉట్నూర్ మండలం లక్షలు పేట గ్రామంలో ఇప్పపువ్వు పండుగ పేరుతో ఇప్ప పువ్వు తో తయారు చేసే రొట్టె గట్టుక లడ్డు తో పాటు సాంప్రదాయ పంటలైన జొన్న మొక్కజొన్న తో తయారు చేసే ఘటికలు తయారుచేసి నా పదార్థాలను ప్రదర్శించి ఆ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు అని సూచించారు ఈ సంవత్సరం కూడా ఇప్పపువ్వు పండుగ మహోత్సవం కార్యక్రమాన్ని ఉట్నూర్ లో నిర్వహించాలని జిల్లా పాలనాధికారి సూచించారు దాంతో ఉట్నూరు మండల కేంద్రంలోని కొమురం భీం ప్రాంగణంలో లో ఈ నెల 31న ఇప్పపూవు పండగ మహోత్సవ కార్యక్రమానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా ఇప్ప పువ్వు తో తయారు చేసే ఆహార పదార్థాలను వాటి ప్రాముఖ్యతను వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకెళుతున్నామని ఆదివాసీలు అంటున్నారు

Body:కంట్రిబ్యూటర్ ర్ రాజేందర్

Conclusion:9441086640
Last Updated : May 31, 2019, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.