ETV Bharat / state

ఇంద్రవెల్లి 'జలియన్​వాలాబాగ్' ఘటన​కు నేటితో 40 ఏళ్లు - indravelli latest news

ప్రతి మనిషీ ఓ ప్రశ్నే.. ఒక సమస్యే అన్నారు తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్‌ నెహ్రూ. నిజమే.. అలాంటి సంఘర్షణలోంచే పురుడుపోసుకుంది ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి ఆదివాసీ ఉద్యమం. నలభై ఏళ్ల కిందట జరిగిన ఆ ఉద్యమంపై పోలీసులు జరిపిన కాల్పులతో ఆధునిక భారతావనిలో మరో జలియన్‌వాలాబాగ్‌ ఘటనగా ప్రాచుర్యం పొందింది. నేటికీ ఉద్యమ స్ఫూర్తిని నింపుతూనే ఉంది.

ఇంద్రవెల్లి ఘటనకు నేటితో 40 ఏళ్లు
ఇంద్రవెల్లి ఘటనకు నేటితో 40 ఏళ్లు
author img

By

Published : Apr 20, 2021, 4:48 AM IST

సహజసిద్ధమైన అటవీ సంపదకు పెట్టింది పేరైనా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జల్‌, జంగల్‌, జమీన్‌ పేరిట.. కుమురం భీం చేసిన పోరాటం తెలుగు గడ్డపై చెదరని సంతకమే. నిజాం పాలనపై తిరుగుబాటు బావుట ఎగరేసిన ఉద్యమమే. దండకారణ్యంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీలో 1975 నుంచి 80 వరకు అప్పటి పటేల్‌, పట్వారీ వ్యవస్థ మరింత మితిమీరింది. విసిగిపోయిన గిరిజనం భూమి, భుక్తి, విముక్తి నినాదంతో.. 1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లిలో నిర్వహించే సభ నిర్వహణకు నగారా మోగించింది. తొలుత సభ నిర్వహణకు అనుమతిచ్చిన అప్పటి పోలీసు యంత్రాంగం.. చివరి నిమిషంలో రద్దు చేసింది. విషయం తెలియని ఆదివాసీ జనం అప్పటికే ఉట్నూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, జైనూరు, కెరమెరి, తలమడుగు, తాంసీ ప్రాంతాల్లోని ప్రతి గూడెంలో తుడుం మోగించి.. ఇంద్రవెల్లి బాట పట్టింది. కాలినడకన, ఎద్దుల బండ్లపై.. ఇలా ఎవరికి తోచినరీతిలో వారు దండులా తరలిరావడంతో ఇంద్రవెల్లి గిరిజన సంద్రంగా మారింది. ఆరోజు ఇంద్రవెల్లి సంత కూడా ఉండడంతో జనం తాకిడి మరింత పెరిగింది.

గుళ్ల వర్షం కురిపించిన పోలీసులు..

సభలో గిరిజన మహిళపై ఓ కానిస్టేబుల్​ అనుచితంగా ప్రవర్తించడం పరస్పరం వాగ్వాదానికి దారితీసింది. బాధిత మహిళ తన చేతిలో ఉన్న కొడవలితో కానిస్టేబుల్‌పై దాడి చేయగా ఆయన చనిపోయారు. అప్పటికే కాల్పుల కోసమే ఎదురుచూస్తున్న పోలీసులు.. మహిళ దాడితో ఒక్కసారి తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో ఎంతో మంది ఆదివాసీలు మృత్యువాతపడటంతో.. ఇంద్రవెల్లి మరో జలియన్​వాలాబాగ్​గా ప్రాచుర్యం పొందింది.

పోలీసు కాల్పుల్లో మరణించిన ఆదివాసీ మృతదేహాలను ఇంద్రవెల్లి దగ్గరలోని వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టగా.. ఆ తర్వాతే అక్కడ భారీ స్తూపం నిర్మించారు. ఆదివాసీల పోరాటం వెనక.. అప్పటి పీపుల్స్‌వార్‌ ప్రమేయం ఉందనేది పాలకుల వాదనగా వినిపిస్తుంటే.. ఇప్పటికీ 40 ఏళ్ల కాలంలో మృతులకు కనీసం నివాళులు అర్పించడానికి సైతం పోలీసులు అనుమతించకపోవడం ఆదివాసీలను మరింత కలిచివేస్తోంది. ప్రతి ఏటా ఏప్రిల్‌ 20 వస్తుందంటే చాలు.. మావోయిస్టుల కదలికల పేరిట ఆ ప్రాంతంవైపు ఆదివాసీలను వెళ్లనీయకుండా అడ్డుకోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

దేశంలో ఎంతో మంది ప్రముఖుల జయంతులు, వర్ధంతులు నిర్వహించుకునే వెసులుబాటు ఇంద్రవెల్లి మృతులకు ఎందుకు వర్తించదనే ఆదివాసీల ఆవేదనకు.. పోలీసుల బందోబస్తే సమాధానమవుతోంది. అమరుల త్యాగ నిరతిని భావితరాలకు చాటిచెప్పేలా ఇంద్రవెల్లి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామనే పాలకుల హామీలు కంటితుడుపు చర్యగానే మిగిలిపోతున్నాయి.

ఇదీ చూడండి: మత రాజకీయాల్లో కాదు అభివృద్ధిలో పోటీ పడండి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.